ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోనున్న అల్లు అర్జున్

Allu Arjun added another feather to his cap. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పుష్ప పాత్రకు ఎంతటి ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకంగా

By Medi Samrat  Published on  12 Oct 2022 5:15 PM IST
ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోనున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పుష్ప పాత్రకు ఎంతటి ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మేనరిజంతోనూ, డైలాగ్స్ తోనూ అల్లు అర్జున్ ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకంగా ఈ సినిమాలో కనిపిస్తాడు. అంత మంచి రోల్ చేసిన అల్లు అర్జున్ ను ఇక అవార్డులు వెంటాడకుండా ఉంటాయా చెప్పండి. ఈవెంట్ ఏదైనా అల్లు అర్జున్ కు మాత్రం అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సైమా, ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. తాజాగా మరో అవార్డు ను కైవసం చేసుకున్నారు. CNN న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఈ రోజు సాయంత్రం ఢిల్లీ లో అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును షారుక్ ఖాన్, రజనీకాంత్ లకు దక్కింది.

అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించారు. పుష్ప పాన్ ఇండియా లో బిగ్ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అజున్ పుష్ప 2 షూటింగ్‌ను ఈ నెల 20న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లు స్టూడియోస్‌లో షూటింగ్ జరగనుంది.


Next Story