'అల్లు అర్హ' వెండితెర ఎంట్రీ.. గర్వంగా ఉందన్న అల్లు అర్జున్

Allu Arha Debuts with Sakuntalam Movie. భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే

By Medi Samrat  Published on  15 July 2021 2:38 PM IST
అల్లు అర్హ వెండితెర ఎంట్రీ.. గర్వంగా ఉందన్న అల్లు అర్జున్

టాలీవుడ్‌ భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సమంత ప్రధానపాత్ర పోషిస్తోన్న విష‌యం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇండ‌స్ట్రికి చెందిన‌ ప్ర‌ముఖ కుటుంబం నుండి మ‌రో వార‌సురాలు ప‌రిచ‌య‌మ‌వ‌బోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ విషయాన్ని స్వ‌యంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా అల్లు కుటుంబం నుంచి నాలుగో తరం సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండడం పట్ల గర్వంగా ఉందని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.


అల్లు అర్హ 'శాకుంతలం' మూవీ ద్వారా సినిమా రంగంలో ప్రవేశిస్తోందని ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు గుణశేఖర్, నీలిమ గుణలకు అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలియ‌జేశారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్హ చిన్ననాటి భరతుడిగా కనిపించనుంది. శకుంతల, దుష్యంతుల కుమారుడే భరతుడు. శకుంతల, దుష్యంతుడి ప్రేమకావ్యాన్ని గుణశేఖర్ 'శాకుంతలం' చిత్ర ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇందులో దుష్యంతుడిగా కేరళ యాక్టర్ దేవ్ మోహన్ నటిస్తుండ‌గా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Next Story