ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ ఉగ్రం

Allari Naresh’s Ugram locks its OTT release date. అల్లరి నరేష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఉగ్రం'లో ఇటీవల కనిపించాడు.

By Medi Samrat  Published on  31 May 2023 6:35 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ ఉగ్రం

Allari Naresh’s Ugram locks its OTT release date


అల్లరి నరేష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఉగ్రం'లో ఇటీవల కనిపించాడు. ఈ చిత్రానికి నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ మర్నా మీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ పోలీస్‌గా నటించాడు. థియేట్రికల్ రన్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం OTTలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఉగ్రం సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో జూన్ 2వ తేదీ నుండి సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనుంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత OTTలోకి వస్తోంది. మూవీ మే 5న థియేటర్లలో రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ కమర్షియల్‏గా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ నరేష్ నటనపరంగా మరోసారి ప్రశంసలు అందుకున్నారు. ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కుటుంబాన్ని కారు ప్రమాదం చిన్నాభిన్నం చేస్తుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత అతని భార్య, కూతురు కనిపించకుండా పోతారు. వాళ్లను వెతికి పట్టుకునేందుకు హీరో చేసిన ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు కీలక పాత్రలు పోషించారు.


Next Story