ఉగ్రం టీజర్ : అల్లరి నరేష్ ఉగ్ర రూపం

Allari Naresh Ugram teaser looks solid.అల్ల‌రి న‌రేష్‌, విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ఉగ్రం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2023 2:47 PM IST
ఉగ్రం టీజర్ : అల్లరి నరేష్ ఉగ్ర రూపం

అల్ల‌రి న‌రేష్ ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. ఒక‌ప్పుడు కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న న‌రేష్ ప్ర‌స్తుతం సీరియ‌స్ పాత్ర‌ల్లోనూ రాణించ‌గ‌లన‌ని నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'ఉగ్రం'. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నాంది చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ప్ర‌స్తుత చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌రేష్ స‌ర‌స‌న మిర్నా మేన‌న్ న‌టిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను హీరో అక్కినేని అఖిల్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. నరేష్ క్యారక్టరైజేషన్ ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ చిత్రంలో న‌రేష్ పోలీస్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. టీజ‌ర్‌తో చిత్రంపై అంచ‌నాలు పెరిగిపోయాయి.

Next Story