అల్లరి నరేష్ సినిమా వాయిదా..!

Allari Naresh movie postponed. అల్లరి నరేష్‌ సినిమా వాయిదా పడింది. గతేడాది విడుదలైన 'నాంది' చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌

By Medi Samrat  Published on  5 Nov 2022 3:42 PM IST
అల్లరి నరేష్ సినిమా వాయిదా..!

అల్లరి నరేష్‌ సినిమా వాయిదా పడింది. గతేడాది విడుదలైన 'నాంది' చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 11న రిలీజ్‌ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలవ్వలేదు. ఇప్పుడు సినిమాను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. రెండు వారాలు ఆలస్యంగా సినిమా విడుదల కానుంది. పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తవకపోవడమే ఇందుకు కారణమని టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

గతంలో నవంబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు సినిమా విడుదల తేదీ నవంబర్ 25కు మార్చారు. ఈనెల 25న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. ఈ చిత్రంలో అయితే జాంబీ రెడ్డి ఫేమ్, శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఆనంది హీరోయిన్ గా నటించగా జీ 5, హాస్య మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించారు.


Next Story