అఖిల్ అదరగొట్టే బాడీ.. మైండ్ బ్లాక్ చేసిన పోస్టర్

Akhil Akkineni shows off the rippling muscles he built for Agent. అక్కినేని అఖిల్.. అక్కినేని నాగార్జున నట వారసుడిగా టాలీవుడ్ లోకి

By Medi Samrat
Published on : 11 July 2021 5:01 PM IST

అఖిల్ అదరగొట్టే బాడీ.. మైండ్ బ్లాక్ చేసిన పోస్టర్

అక్కినేని అఖిల్.. అక్కినేని నాగార్జున నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకూ సరైన హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా 'పూజా హెగ్డే' నటించింది. ఇప్పటికే విడుదలైన సింగిల్, టీజర్ కూడా ఆకట్టుకున్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ పలు మార్లు వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేయడానికి అక్కినేని అఖిల్ సిద్ధమయ్యాడు.

అఖిల్ 'ఏజెంట్' సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో అఖిల్ బాడీ చూసి అభిమానులు షాక్ అవుతూ ఉన్నారు. ఇంత బాడీని అఖిల్ బిల్డ్ చేశాడా అంటూ నోరెళ్లబెడుతూ ఉన్నారు. కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న అఖిల్‌ ఫోటోను రిలీజ్‌ చేస్తూ..'ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ' అంటూ తాజాగా పోస్టర్‌ను వదిలారు. అఖిల్‌ బాడీపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తుంది. 'ఏజెంట్‌ లోడింగ్‌. వైల్డ్‌ రైడ్‌కు మీరు సిద్ధంగా ఉన్నారా' అంటూ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అఖిల్ లో ఈ రేంజ్ ఛేంజ్ వచ్చిందా అంటూ అందరూ షాక్ అవుతూ ఉన్నారు.


Next Story