ఆకాంక్ష మృతిపై ఆమె తల్లి సంచలన వ్యాఖ్యలు

Akanksha Dubey suicide case. భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడింది. ఆకాంక్ష మృతిపై ఆమె తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat
Published on : 27 March 2023 7:00 PM IST

ఆకాంక్ష మృతిపై ఆమె తల్లి సంచలన వ్యాఖ్యలు

Akanksha Dubey


భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడింది. ఆకాంక్ష మృతిపై ఆమె తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె మరణానికి సమర్ సింగ్, సంజయ్ సింగ్‌లే కారణమని ఆమె తల్లి ఆరోపించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆకాంక్ష ఆత్మహత్యకు పాల్పడింది. 25 ఏళ్ల నటి వారణాసిలోని ఓ హోటల్‌లో శవమై కనిపించింది. భోజ్‌పురి గాయకుడు సమర్ సింగ్, అతడి సోదరుడు సంజయ్ సింగ్ తన కుమార్తెను బెదిరించారని ఆకాంక్ష దుబే తల్లి మధు దూబే ఆరోపించారు. నటి మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. నటి చనిపోయే కొన్ని గంటల ముందు, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడుస్తూ కనిపించింది.

మృతురాలు ఆకాంక్ష దూబే తల్లి మధు దూబే తెలిపిన వివరాల ప్రకారం, గత మూడేళ్లుగా తన కుమార్తెతో సమర్ సింగ్, సంజయ్ సింగ్ పనులు చేయించుకున్నారు. ఆమెకు అందాల్సిన డబ్బులు ఇవ్వలేదు. మార్చి 21న సమర్ సింగ్ సోదరుడు సంజయ్ సింగ్ ఆకాంక్ష దూబేని చంపేస్తానని బెదిరించినట్లు మధు దూబే వెల్లడించారు. ఈ విషయాన్ని ఆకాంక్ష స్వయంగా నాకు ఫోన్ ద్వారా తెలియజేసిందని మధు దూబే తెలిపారు.


Next Story