ఆత్మహత్య చేసుకున్న నటి ఆకాంక్ష

Akanksha Dubey commits suicide. భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య చేసుకుంది. బనారస్‌లోని ఓ హోటల్‌లో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

By M.S.R  Published on  26 March 2023 5:14 PM IST
ఆత్మహత్య చేసుకున్న నటి ఆకాంక్ష

Akanksha Dubey

భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య చేసుకుంది. బనారస్‌లోని ఓ హోటల్‌లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. హోటల్ సారనాథ్‌లోని ఒక గదిలో నటి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నటికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆమె మరణాన్ని ధృవీకరించారు. ఆమె 'నాయక్' సినిమా షూటింగ్ నేడు మొదలుపెట్టాల్సి ఉంది. సెట్స్‌లో ఆమె మొదటి రోజు. మేకర్స్ వారణాసిలో షూటింగ్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆమె మేకప్ బాయ్ ఆమెను పిలవడానికి వెళ్ళినప్పుడు హోటల్ గదిలో శవమై కనిపించింది. ఆకాంక్ష దూబే ఇటీవల భోజ్‌పురి గాయకుడు-నటుడు యష్ కుమార్‌తో కలిసి 'మిట్టి' షూటింగ్‌ను పూర్తి చేసింది.

ఆకాంక్ష వయస్సు 25 సంవత్సరాలు. ఆత్మహత్యకు కొన్ని గంటలముందే పవన్ సింగ్‌తో కలిసి ఆమె చేసిన మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుంది. ఆకాంక్ష దూబే 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జన్మించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆకాంక్ష ఇన్‌స్టాగ్రామ్‌లో రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Next Story