పవర్ స్టార్ సినిమాలో ఆ హీరోయిన్.!

Aishwarya Rajesh A tribal lady in Pawan Kalyan and Krish film. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కొత్త సినిమా లో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.

By Medi Samrat  Published on  5 Jan 2021 7:57 PM IST
Pavan Kalyan latest movie heroine

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది విరామం తర్వాత చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇందులో మొదటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శృతి హసన్ తో జతకట్టి పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ "చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ తొందరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాల‌నే యోచనలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరొక సినిమాలో నటించనున్న సంగతి మనకు తెలిసిందే.

పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరొక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల ద్వారా అందరిని ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు క్రిష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ను ప్రేమించే సాధారణ గిరిజన మహిళ‌ పాత్రలో ఐశ్వర్య రాజేష్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్.. పవన్ కళ్యాణ్ ను ప్రేమలో పడేయనుందా? లేకపోతే ఆ అవకాశం మరెవరికైనా ఇస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తవడంతో.. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లు తీయబోయే సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని చెప్పవచ్చు. అయితే పవన్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Next Story