హాట్ యాక్ట్రెస్ అకౌంట్ ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారు..

After 'attempted hack', Nora Fatehi returns to Instagram. నోరా ఫతేహి.. సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం

By Medi Samrat  Published on  5 Feb 2022 2:57 PM IST
హాట్ యాక్ట్రెస్ అకౌంట్ ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారు..

నోరా ఫతేహి.. సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేని నటి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా పలు డ్యాన్స్ నంబర్స్ లో సందడి చేసింది నోరా. అమ్మడి సోషల్ మీడియా అకౌంట్స్ కు భారీగా ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఉన్నట్లుండి నోరా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె ఫాలోవర్స్ తెగ టెన్షన్ పడ్డారు. నోరా ఫతేహి దుబాయ్ లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ.. తన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా నోరా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కనిపించకుండా పోయింది. ఊహించని విధంగా ఏమైంది అని ఆమె అనుచరులు, శ్రేయోభిలాషులు ఆరా తీశారు. కొంత విరామం తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కి తిరిగి రావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

నోరా ఫతేహి ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ చేయబడిందని వెల్లడించింది. ఖాతాను పునరుద్ధరించడంలో తనకు సహకరించిన ఇన్‌స్టాగ్రామ్ సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాక్ చేయడానికి ప్రయత్నించారు! ఉదయం నుండి ఎవరో నా ఖాతాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని..ఇంస్టాగ్రామ్ సిబ్బంది దీన్ని త్వరగా క్రమబద్ధీకరించడంలో నాకు సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు అని తెలిపింది. "Sorry guys! There was an attempted hack on my Instagram! Someone's been trying to get into my account since morning. Thanks to the Instagram team for helping me sort this out so quickly @instagram." అంటూ పోస్టు పెట్టింది నోరా.


Next Story