వారి మధ్య 'మహా' సముద్రమంత ప్రేమ ఉందా..?

Aditi Rao Hydari's rumoured BF Siddharth shares unseen photo. హీరో సిద్ధార్థ్ చాలా రోజుల తర్వాత తెలుగులో కనిపించిన సినిమా 'మహా సముద్రం'.

By Medi Samrat  Published on  29 Oct 2022 9:00 PM IST
వారి మధ్య మహా సముద్రమంత ప్రేమ ఉందా..?

హీరో సిద్ధార్థ్ చాలా రోజుల తర్వాత తెలుగులో కనిపించిన సినిమా 'మహా సముద్రం'. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో కనిపించిన సిద్ధార్థ్ కు జోడీగా అదితి రావు హైదరీ కనిపించింది. ఈ సినిమా సమయం నుండి వారి మధ్య స్నేహం చిగురించిందని చెబుతూ వస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ సోషల్ మీడియాలో అదితి రావు హైదరీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన పోస్టు మరేదో సూచిస్తోందని అంటున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నారని ఇప్పటికే రూమర్స్ షికారు చేస్తూ ఉన్నాయి.

'హృదయ యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ ప్రతి కల నెలవేరాలని కోరుకుంటున్నాను' అని సిద్ధార్థ్ పోస్టు పెట్టాడు. దీన్ని చూసిన నెటిజెన్లు వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ చెబుతూ వస్తున్నారు. ఇటీవల వచ్చిన 'మహాసముద్రం' సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి నటించారు. ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ కు జోడీగా ఆమె నటించింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ప్రారంభమైన స్నేహం అనుబంధానికి దారి తీసిందని చెపుతున్నారు. సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ డేటింగ్ చేస్తున్నట్లు పలు మీడియా సంస్థలు నివేదించాయి. అయితే ఇద్దరూ తమ సంబంధాన్ని ధృవీకరించలేదు. అక్టోబర్ 28న సిద్ధార్థ్ అదితికి 36వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అదితితో కలిసి సిద్ధార్థ్ ఫోటో షేర్ చేయడం ఇదే తొలిసారి.


Next Story