పిల్ల‌ల కెరీర్, ఆరోగ్యాలు పాడ‌వుతున్నాయి : సురేఖా వాణి షాకింగ్ వీడియో

Actress Surekha Vani Reaction on Tollywood Drugs Case. డ్ర‌గ్స్ కేసు టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతుంది. ఇటీవ‌ల టాలీవుడ్‌కి చెందిన నిర్మాత కె.పి.చౌద‌రి అరెస్ట్ కావ‌టంతో

By Medi Samrat  Published on  25 Jun 2023 7:17 PM IST
పిల్ల‌ల కెరీర్, ఆరోగ్యాలు పాడ‌వుతున్నాయి : సురేఖా వాణి షాకింగ్ వీడియో

డ్ర‌గ్స్ కేసు టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతుంది. ఇటీవ‌ల టాలీవుడ్‌కి చెందిన నిర్మాత కె.పి.చౌద‌రి అరెస్ట్ కావ‌టంతో డ్ర‌గ్స్ కేసు తెర‌పైకొచ్చింది. ఆ కేసుకు సంబంధించిన‌ రిమాండ్ నోటీసులో 12 మంది పేర్లు ఉన్నాయంటూ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. 12 మందిలో సినీ, రాజకీయ ప్ర‌ముఖులున్నారంటూ క‌థ‌నాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ లిస్టులో ప్ర‌ముఖంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషు రెడ్డితో పాటు న‌టి జ్యోతి, సురేఖా వాణి కూతురు సుప్రీతా పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో వీరు కె.పి.చౌద‌రితో ఉన్న ఫొటోలు నెట్టింట‌ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మీడియాలో డ్ర‌గ్స్ కేసుకు లింకు పెట్టి న్యూస్ రావ‌టంపై ఇప్ప‌టికే ఆషురెడ్డి, న‌టి జ్యోతి స్పందించారు. తాజాగా సురేఖా వాణి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా రియాక్ట‌య్యారు.

ఈ మ‌ధ్య మీడియాలో మాపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు, మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు చేస్తోన్న ఆరోప‌ణ‌ల కార‌ణంగా మా కెరీర్‌, మా పిల్ల‌ల కెరీర్‌, ఫ్యామిలీ భ‌విష్య‌త్, ఆరోగ్యాలు పాడ‌వుతున్నాయి. ద‌య‌చేసి ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌కండి అంటూ అభ్య‌ర్ధించారు సురేఖా వాణి. సురేఖా వాణి వీడియో షోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.


Next Story