తల్లి అయిన నటి పూర్ణ

Actress Poorna Gave Birth To Baby Boy. సినీ నటి పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

By Medi Samrat
Published on : 4 April 2023 7:11 PM IST

తల్లి అయిన నటి పూర్ణ

సినీ నటి పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తెలుగు, మలయాళం, తమిళం సినిమాల ద్వారా నటిగా మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ దుబాయ్ లో ఉన్న వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. తాను గర్భవతి అయినట్టు గత డిసెంబర్ లో ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించింది. సినిమాల విషయానికి వస్తే నాని తాజా చిత్రం 'దసరా'లో ఆమె నటించింది. పూర్ణ తల్లి అయిందనే వార్తతో ఆమె అభిమానులు సంతోషానికి గురవుతున్నారు. ఆమెకు పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Next Story