ఆమె అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళల్లో ఒకరు

Actress Manjari About Her Grand Mother. ఆనందంగా ఉండే అమ్మ‌మ్మ, తాత‌య్య‌ల‌తో గడిపిన జ్ఞాపకాలను ఎవరు ఆస్వాదించ‌రు

By Medi Samrat  Published on  22 April 2022 4:42 PM IST
ఆమె అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళల్లో ఒకరు

ఆనందంగా ఉండే అమ్మ‌మ్మ, తాత‌య్య‌ల‌తో గడిపిన జ్ఞాపకాలను ఎవరు ఆస్వాదించ‌రు?. షరతులు లేని వారి ప్రేమ ఓ నిధి. అమ్మమ్మ, మనవళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌ మధ్య బంధం నిజంగా అసాధారణమైనది. మాటలలో చెప్పలేము. తాజాగా అమ్మమ్మ పట్ల తనకున్న అనంతమైన ప్రేమను తెలియజేస్తూ, నటి మంజరీ ఫడ్నిస్ తన అమ్మమ్మ తన జీవితంలో నిజమైన ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.

"ఆమె ఆల్ ఇండియా రేడియోలో గాయని.. ఆమె చాలా కూల్. 89/90 సంవత్సరాల వయస్సులో స్విమ్మింగ్ & జిమ్‌కి వెళ్లేది. నాకు తెలిసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళల్లో ఒకరు అంటూ ల‌వ్ సింబ‌ల్‌ను పోస్టుకు జ‌త‌ప‌రిచింది. ప్ర‌స్తుతం ఈ పోస్టు 'కూ' లో వైర‌ల్‌గా మారింది.

ఇదిలావుంటే.. 2009 రొమాంటిక్ డ్రామా 'జానే తు యా జానే నా'లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మంజరీ ఫడ్నిస్.. త‌ర్వాత‌ పలు దక్షిణ భారత చిత్రాలలో కూడా నటించారు. ఆమె తమిళం, మరాఠీ సినిమాలలో పాట‌లు కూడా పాడింది.


Next Story