అనుపమ-బుమ్రా పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అనుపమ తల్లి

Actress Anupama Parameswaran's Mother Rubbishes Rumours Of The Actress' Wedding With Jasprit Bumrah. అనుపమ-బుమ్రా పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అనుపమ తల్లి

By Medi Samrat  Published on  6 March 2021 6:11 PM IST
Actress Anupama Parameswaran’s Mother Rubbishes Rumours Of The Actress’ Wedding With Jasprit Bumrah

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడని.. అందుకే ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు నుంచి బుమ్రా తప్పుకున్నాడనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో అనుపమ పెట్టిన పోస్టు కూడా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో అనుపమ తల్లి స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఒక సినిమా షూటింగ్ కోసమే తన కూతురు గుజరాత్ కు వెళ్లిందని చెప్పుకొచ్చారు.

బుమ్రా పెళ్లాడబోయేది అనుపమను కాదు.. 28 ఏళ్ల సంజనా గణేశన్ అనే ఓ స్పోర్ట్స్ ప్రెజెంటర్ ని అంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. మహారాష్ట్రకు చెందిన‌ సంజనా గణేశన్ ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 7 తో కెరీర్ ఆరంభించింది. ఐపీఎల్‌ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే బుమ్రాతో ఏర్పడిన పరిచయం.. పెళ్ళికి దారి తీసిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. బుమ్రా వివాహం గోవాలో జ‌ర‌గ‌నుందని.. క‌రోనా నేప‌థ్యంలో అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోబుతున్నాడ‌ని అంటున్నారు. ఈ పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చే దాకా క్లారిటీ రావాల్సి ఉంది.


Next Story