విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

Actor Theepetti Ganesan dies in Madurai due to ill health. తమిళ సినీ ఇండ‌స్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కమెడియన్ తేపట్టి

By Medi Samrat  Published on  22 March 2021 1:31 PM GMT
విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

తమిళ సినీ ఇండ‌స్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కమెడియన్ తేపట్టి గణేశన్ మరణించాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న తమిళ కమెడియన్ తేపట్టి గణేశన్ కన్నుమూశాడు. గణేశన్‌కు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగుండటం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆయన్ని మధురైలోని రాజాజీ హాస్పిటల్‌లో చేర్పించారు.


అక్కడ కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయనకు.. గుండెపోటు రావడంతో సోమ‌వారం నాడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. గ‌ణేశ‌న్ మ‌ర‌ణవార్త‌ను త‌మిళ దర్శకుడు శ్రీను రామస్వామి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. చాలా చిన్న వయసులోనే ఆయన కన్నుమూయడం తమిళ ఇండస్ట్రీకి తీరనిలోటు అంటూ ట్వీట్ చేశాడు. గ‌ణేశ‌న్ కు కార్తి అనే మరో పేరు కూడా ఉంది. గ‌ణేశ‌న్ మ‌ర‌ణవార్త విన్న‌ నటీనటులు కూడా విషాదంలో మునిగిపోయారు. తమిళ ఇండ‌స్ట్రీ అద్భుతమైన నటుడిని కోల్పోయింది అంటూ ప్రముఖులు సంతాపం తెలియచేశారు. ఇదిలావుంటే.. తేపట్టి గణేశన్ రేణిగుంట, బిల్లా-2, తెన్మెర్కు పరువాకత్రు, ఉస్తాద్ హోటల్, నీరపరై, కన్నే కలైమనే అనే సినిమాల‌లో న‌టించి న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.Next Story