టెన్షన్ పడకండి.. ఆసుపత్రి నుండి మాస్ మహారాజ్ డిశ్చార్జ్

హీరో రవితేజ కుడి చేతికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. షూటింగ్ లో గాయపడిన రవితేజ గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్ కొనసాగించారు

By Medi Samrat  Published on  24 Aug 2024 8:15 PM IST
టెన్షన్ పడకండి.. ఆసుపత్రి నుండి మాస్ మహారాజ్ డిశ్చార్జ్

హీరో రవితేజ కుడి చేతికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. షూటింగ్ లో గాయపడిన రవితేజ గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్ కొనసాగించారు. అయితే గాయం తీవ్రం కావడంతో చేతికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. రవితేజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని.. రవితేజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఎంతోమంది సందేశాలు పంపారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని వివరించారు. త్వరలోనే షూటింగ్ కు హాజరయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని రవితేజ తెలిపారు.

రవితేజ ఇటీవల షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఆయన కుడిచేతికి గాయం కాగా గాయంతోనే రవితేజ షూటింగ్‌లో పాల్గొన్నారు. గాయం మరింత ఎక్కువ కావడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు.

Next Story