టాలీవుడ్‌లో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు క‌న్నుమూత‌

Actor Potti Veeraiah Passes Away. టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో

By Medi Samrat
Published on : 25 April 2021 7:14 PM IST

టాలీవుడ్‌లో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య ఆదివారం ఉదయం గుండె పోటు రావడంతో ఓ ప్రవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అక్క‌డ‌ ప‌రిస్థితి విష‌మించ‌డంతో సాయంత్రం 4.33 నిమిషాలకు వీర‌య్య‌ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. విఠలాచార్య 'అగ్గివీరుడు' చిత్రంతో నటుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యారు. వీర‌య్య తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 500కుపైగా చిత్రాల్లో న‌టించారు. దాసరి ప్రొత్సాహంతో 'తాతమనవడు' చిత్రంలో కీలక పాత్రలో నటించిన పొట్టి వీరయ్య ప్రేక్ష‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు. పొట్టి వీర‌య్య కుమార్తె విజ‌య దుర్గ కూడా న‌టిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలు.


Next Story