బహుమానంగా రూ.50 లక్షల గుర్రం.. రూ.9 లక్షల పిల్లి.. విమానాశ్రయంలో హీరోయిన్‌ను అందుకే అపారా..?

Actor Jacqueline Fernandez Stopped From Leaving India Over Extortion Case. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విదేశాలకు వెళ్లకుండా

By Medi Samrat  Published on  6 Dec 2021 10:04 AM IST
బహుమానంగా రూ.50 లక్షల గుర్రం.. రూ.9 లక్షల పిల్లి.. విమానాశ్రయంలో హీరోయిన్‌ను అందుకే అపారా..?

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విదేశాలకు వెళ్లకుండా ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఆమె ఒక ఈవెంట్ కోసం దుబాయ్‌కు బయలుదేరింది. అయితే ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లుకౌట్ నోటీసు జారీ చేయడంతో అధికారులు విమానాశ్రయంలో నిలిపివేశారు. ఈడీ లుకౌట్ నోటీసుల నేపథ్యంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు స్వల్ప నిర్బంధం తర్వాత ఆమెను విడిచిపెట్టారు. ముంబై విడిచి వెళ్లేందుకు అనుమతించారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. విచారణ సమయంలో సుఖేశ్ జాక్వెలిన్ పేరు కూడా వెల్లడించినట్టు సమాచారం.

ఆమెకు రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గుర్రం, రూ.9 లక్షల విలువ చేసే పిల్లిని బహుమానంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాక్వెలిన్ కు సమన్లు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి వచ్చిన నటిని అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు ఆమెపై జారీ అయిన లుకౌట్ నోటీసుల గురించి చెప్పారు. ఆ తర్వాత వారు ఆ విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాలపై జాక్వెలిన్‌ను వదిలిపెట్టారు.

200 కోట్ల రూపాయల మనీలాండరింగ్, దోపిడీ కేసులో జాక్వెలిన్ పేరు బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ నుండి ఆమె అనేక ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్ చంద్రశేఖర్‌తో ఉన్న కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో ఇద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం కూడా గమనించవచ్చు. జాక్వెలిన్ సాహో సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఆఫర్ వచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.


Next Story