విషాదంలో ఇండ‌స్ట్రీ.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌

Actor Chandrashekhar Passes Away. ప్ర‌ముఖ న‌టుడు చంద్రశేఖ‌ర్ (98) క‌న్నుమూశారు. రామాయ‌ణ్ ధారావాహిక‌తో న‌టుడిగా

By Medi Samrat  Published on  16 Jun 2021 5:14 PM IST
విషాదంలో ఇండ‌స్ట్రీ.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టుడు చంద్రశేఖ‌ర్ (98) క‌న్నుమూశారు. రామాయ‌ణ్ ధారావాహిక‌తో న‌టుడిగా మంచి గుర్తింపు పొందిన చంద్రశేఖ‌ర్.. ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. వ‌యోభారంతో చంద్రశేఖ‌ర్ స్వ‌గృహంలోనే బుధ‌వారం ఉద‌యం తుది శ్వాస విడిచారు. 1923లో హైద‌రాబాద్‌లో పుట్టిన చంద్ర‌శేఖ‌ర్ న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో 1950లో జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ త‌ర్వాత 'సురంగ్' అనే చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. 250కిపైగా చిత్రాల్లో చంద్ర‌శేఖ‌ర్ న‌టించారు.

చంద్రశేఖ‌ర్ మ‌ర‌ణంపై ఆయ‌న‌ కుమారుడు, నిర్మాత అశోక్ శేఖ‌ర్ మాట్లాడుతూ.. నాన్న‌గారు నిద్ర‌లోనే క‌న్నుమూశారు. ఆయ‌నికి ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేవు. వ‌య‌సు మీద ప‌డ‌టంతోనే చ‌నిపోయారని తెలిపారు. జుహులోని ప‌వ‌న్ హాన్స్‌లో ఈ రోజు సాయంత్రం ఆయన అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయని పేర్కొన్నారు. డీడీ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మైన‌ రామాయ‌ణ్ సీరియ‌ల్‌లో ఆర్య సుమంత్ అనే పాత్ర ద్వారా విశేష ప్రేక్ష‌కాధ‌ర‌ణ పొందారు చంద్రశేఖ‌ర్. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సీనీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.


Next Story