విషాదంలో సినీ ఇండస్ట్రీ.. స్నానానికి వెళ్లి నటుడు మృతి

Actor Anil Nedumangad Passed Away. మలయాళ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ నటుడు అనిల్. పి. నేదుమంగాడ్

By Medi Samrat  Published on  25 Dec 2020 4:40 PM GMT
విషాదంలో సినీ ఇండస్ట్రీ.. స్నానానికి వెళ్లి నటుడు మృతి

మలయాళ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ నటుడు అనిల్. పి. నేదుమంగాడ్ మ‌ర‌ణించారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన కేరళలోని తోడుపుళలోని మలంకరలో ఉన్నారు. అక్క‌డే ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ ఆనకట్ట వ‌ద్ద‌కు తన స్నేహితులతో కలిసి సరదాగా స్నానం చేయడానికి వెళ్లారు. కానీ మృత్యువు ఆయన్ని కాటేసింది.

వివ‌రాళ్లోకెళితే.. అనిల్. పి. నేదుమంగాడ్.. జోజు జార్జ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం మలంకర వెళ్లారు. క్రిస్మస్ సందర్భంగా సరదాగా ఆన‌క‌ట్ట వ‌ద్ద‌కు ఈత కొట్టడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయి ప్రాణాలు విడిచారు. అనిల్‌ సినిమాల్లోకి రాకముందు బుల్లితెరపై యాంకర్, నిర్మాతగా రాణించారు. 2014లో సినిమాల్లోకి వచ్చారు. పావడ, కమ్మట్టి పాదం, కిస్మత్, పెరోల్, అయ్యప్పనమ్ కోషియం వంటి చిత్రాల్లో అనిల్ నేదుమంగడ్ నటించారు.

ఫిబ్రవరిలో విడుదలైన పాపం చెయ్యతవర్ కల్లెరియట్టేలో ఆయన చివరిసారిగా స్క్రీన్‌పై కనిపించారు. ఈయన మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు సంతాపం తెలియచేశారు. అనిల్ మరణం మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌కు తీరనిలోటని పేర్కొన్నారు.
Next Story
Share it