ఆచార్యకు అదిరిపోయే రెస్పాన్స్
Acharya Trailer Release. 'ఆచార్య' సినిమా సందడి మొదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను
By Medi Samrat Published on 12 April 2022 7:01 PM IST'ఆచార్య' సినిమా సందడి మొదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఏప్రిల్ 29వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటిస్తూ ఉండడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. చిరంజీవి సరసన కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనిపించనుంది. సిద్ధ పాత్రలో చరణ్ కనిపించనుండగా, సోనూ సూద్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి చరణ్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు.
చిరంజీవికి ఇది 152వ సినిమా కావడంతో ముఖ్యమైన 152 థియేటర్లలో 'ఆచార్య' ట్రైలర్ ను ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోని కొన్ని థియేటర్లలో ఆచార్య ట్రైలర్ హంగామా మొదలైంది. ఏప్రిల్ 12న సాయంత్రం 5:49 గంటలకు ట్రైలర్ ను థియేటర్లలో విడుదల చేశారు. ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లో చిరంజీవి-రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోయిందని అంటున్నారు.