లవ్ స్టోరీ కోసం వస్తున్న ఆమీర్ ఖాన్
Aamir khan Attends For Love Story Pre Release Event. నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
By Medi Samrat Published on 19 Sept 2021 6:36 PM ISTనాగచైతన్య.. సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గ్రాండ్‌గా నిర్వహించనున్నారు చిత్రయూనిట్. ఇందుకోసం ఇద్దరు స్టార్ హీరోలు గెస్ట్లుగా రాబోతున్నారు. అందులో ఒకరు మెగాస్టార్ కాగా మరొకరు ఏకంగా బాలీవుడ్ స్టార్.. అదేనండి ఆమిర్ ఖాన్. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్ధా సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రానున్నారు.
ఈరోజు హైదరాబాద్ లో ఆమిర్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి ఆమిర్ ఖాన్ మొక్కలు నాటారు. ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మంచి జీవితాన్ని ఇచ్చినవాళ్లం అవుతామన్నారు. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా, నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆమిర్ పిలుపునిచ్చారు.