దేవర టికెట్ల విషయంలో ఊహించని షాక్

దేవర: పార్ట్ 1, జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన ఎపిక్ యాక్షన్ సాగా థియేటర్లలో విడుదల కాబోతోంది

By Medi Samrat  Published on  25 Sep 2024 9:40 AM GMT
దేవర టికెట్ల విషయంలో ఊహించని షాక్

దేవర: పార్ట్ 1, జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన ఎపిక్ యాక్షన్ సాగా థియేటర్లలో విడుదల కాబోతోంది. టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త ప్రీ-సేల్స్‌లో USAలో $2 మిలియన్లతో సహా రూ. 50 కోట్ల విలువైన టిక్కెట్‌లను విక్రయించడంతో బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తూ ఉంది. ఈ చిత్రం ప్రీ-సేల్స్‌ను పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అతిపెద్ద సోలో ఓపెనర్ గా దేవర సినిమా నిలవనుంది. దేవర ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.

దేవర సినిమా టికెట్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం ఊహించని షాక్ తగిలింది. టికెట్‌ ధర పెంపును 14 రోజుల కాకుండా 10 రోజులకే పరిమితం చేయాలని హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొదట 14 రోజుల పాటు టికెట్ల రేటు పెంచుకునే వెసులుబాటుతో పాటు రిలీజ్‌ రోజు ఆరు ఆటలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. దేవర టికెట్‌ ధర పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. విచారణ చేపట్టిన ధర్మాసనం ధర పెంపును 10 రోజుల వరకే పరిమితం చేయాలని ఏపీ​ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా టికెట్ రేట్లను పెంచుకోడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారులు టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చారు. 'దేవర' విడుదల రోజున అదనపు షోలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తెలంగాణలో, మొదటి రోజు ఉదయం 4 గంటల నుండి ఆరు షోలు ప్రారంభమవుతాయి, అలాగే టికెట్‌ రూ.100 ధర పెంపు ఉంటుంది. 2వ రోజు (సెప్టెంబర్ 28) నుండి 10వ రోజు (అక్టోబర్ 6) వరకు ఈ చిత్రం ఐదు రోజువారీ షోలు చూడొచ్చు. మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధరలను రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25 పెంచారు.

Next Story