జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన.. 'కలర్ ఫొటో' కు అవార్డు
68th National Film Awards winners list. 2021-22కిగానూ 68వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
By Medi Samrat
2021-22కిగానూ 68వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం అవార్డులను వెల్లడించింది. ఫీచర్ ఫిల్మ్స్ లో 30 భాషలకు చెందిన 305 సినిమాలు అవార్డులకు పోటీ పడ్డాయని తెలిపారు. జ్యూరి చైర్మెన్ విపుల్ అమృతలాల్ షా సారథ్యంలోని జ్యూరి ఫీచర్ ఫిల్మ్స్ ని ప్రకటించారు. ఫీచర్ ఫిల్మ్స్ లో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా `కలర్‌ఫోటో` నిలిచింది. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్‌ఎస్ థమన్ (అలా వైకుంఠపురములో) చిత్రానికి గానూ అవార్డుని అందుకున్నారు. మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో `నాట్యం` చిత్రానికి పనిచేసిన టీవీ రాంబాబుకి అవార్డు దక్కింది.
ఉత్తమ తెలుగు కథా చిత్రంగా 'కలర్ ఫొటో' నిలిచింది. 'నాట్యం' చిత్రానికి 2 జాతీయ అవార్డులు.. బెస్ట్ కొరియాగ్రఫీ, బెస్ట్ మేకప్ విభాగాల్లో 'నాట్యం'కు అవార్డులు వచ్చాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ (అల వైకుంఠపురం) నిలిచాడు. 2020 ఏడాదికి ఉత్తమ చిత్రంగా సూరారాయ్ పోట్రు నిలిచింది. ఈ ఏడాది బెస్ట్ క్రిటిక్ అవార్డు ఎవరికీ ఇవ్వడం లేదని కేంద్రం ప్రకటించింది
తెలుగు దర్శకురాలు సుధ కొంగర రూపొందించిన సూరారాయ్ పోట్రు చిత్రం 68వ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమాలో గోపినాథ్ పాత్రలో కనిపించిన తమిళ స్టార్ హీరో సూర్య జాతీయ ఉత్తమ నటుడిగా, ఆయనకు జోడీగా కనిపించిన అపర్ణ బాలమురళి జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాశ్ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు.