క‌రోనా వైర‌స్‌ ధాటికి ప్ర‌పంచ‌మంతా స్తంభించిన విష‌‌యం తెలిసిందే. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఏ ప‌ని ముందుకు సాగ‌ని ప‌రిస్థితి.. ఈ కార్యం జ‌రుపుకోలేని దుస్థితి. లాక్‌డౌన్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా జ‌నం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల పిలుపు మేర‌కు ఇంటిప‌ట్టునే ఉంటూ.. వైర‌స్ నియంత్ర‌ణ‌లో బాగ‌స్వామ్యులు అవుతున్నారు. ఇదిలావుంటే.. లాక్‌డౌన్ కార‌ణంగా ఓ మహిళా పోలీసు అధికారి త‌న వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.

వివ‌రాళ్లోకెళితే.. క‌ర్ణాటక రాష్ట్రం మండ్యా జిల్లాలోని మ‌ళ‌వ‌ళ్లి డీఎస్పీగా ఎం.జే. పృధ్వీ విధులు నిర్వ‌హిస్తుంది. ఆమె వివాహం ఏప్రిల్ 4న ద్యామ‌ప్ప అనే యువ‌కునితో జ‌రుప నిశ్చ‌య‌మైంది. ఈ మేర‌కు వివాహానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. పెళ్లికి ధార్వాడ‌లో, రిసెప్ష‌న్‌కు మైసూరులో పంక్ష‌న్ హాళ్లు కూడా బుక్ చేశారు. ఓ ప‌క్క పెళ్లి ఏర్పాట్లు జ‌రుగుతున్నా పృధ్వీ మాత్రం లాక్‌డౌన్ విధుల్లో కొన‌సాగుతూనే ఉన్నారు.
అయితే.. ఒక్క‌సారిగా సీన్ రివ‌ర్స్ అయ్యింది. తాను విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ మండ్యా, రిసెప్ష‌న్ ఏర్పాట్లు చేసుక‌న్న‌ మైసూరు జిల్లాల్లో కరోనా కేసులు ఒక్క‌సారిగా పెరిగాయి. ఈ నేఫ‌థ్యంలో పృధ్వీ పెళ్లి వాయిదా వేసుకుని.. డ్యూటీ చేయ‌డానికే మొగ్గుచూపింది. ఏ ఒక్క‌రితో క‌డా పెళ్లి వాయిదా విషయాన్ని పంచుకోలేదు. విష‌యం ఎలా లీకైందో లీక‌య్యింది.. పృధ్వీ పెళ్లి వాయిదా వేసుకున్నారని తెలిసిన‌ సహచర అధికారులు ఆమెను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. విష‌యం తెలుసుకున్న మాండ్యా ఎంపీ సుమలత అంబ‌రీష్.. డీఎస్పీ పృధ్వీ నిబ‌ద్దత‌ను కొనియాడారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.