శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 May 2020 11:48 AM GMT
అనారోగ్య కారణాలతో బాధపడుతున్న శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కృష్ణ వర్మ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ బీచ్ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య కారణాల వల్లే డీఎస్పీ కృష్ణ వర్మ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం కృష్ణ వర్మకు గుండెకు సంబంధించిన సర్జరీ కూడా జరిగినట్లు తెలుస్తుంది.
ఇదిలావుంటే.. కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదేళ్లపాటు ఎస్‌ఐగా, ట్రాఫిక్ సీఐగా పని చేశారు. అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. డిపార్ట్‌మెంట్‌లో మంచి సౌమ్యుడిగా పేరున్న కృష్ణ వర్మ ఆత్మహత్య చేసుకున్నరన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story