నా ఇమేజ్‌ డ్యామేజ్‌ చేస్తున్నారంటూ దగడ్‌ సాయి ఫిర్యాదు..

By అంజి  Published on  21 March 2020 9:13 AM GMT
నా ఇమేజ్‌ డ్యామేజ్‌ చేస్తున్నారంటూ దగడ్‌ సాయి ఫిర్యాదు..

హైదరాబాద్‌: బోయిన్‌పల్లి దగడ్‌ సాయి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. తన కుటుంబ సభ్యులతో చేసిన టిక్‌టాక్‌ను సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వైరల్‌ చేస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. తన పర్సనల్‌ ఇమేజ్‌ను కావాలని కొందరు డ్యామేజ్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదులో దగడ్‌ సాయి పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులతో తాను చేసిన టిక్‌ టాక్‌ను అసభ్యకరంగా పోస్టులు పెడుతూ కొందరు ఫేస్‌బుక్‌లో ట్యాగ్‌లు పెడుతున్నారని పోలీసులకు తెలిపారు. కాగా దగడ్‌ సాయి ఫిర్యాదును సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్వీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టిక్‌టాక్‌లో కొన్ని వీడియోలు వైరల్‌ చేయడం పట్ల ఎంతో మంది అమ్మాయిలు ఆవేదనకు గురవుతున్నారని దగడ్‌ సాయి వాపోయాడు. ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దగడ్‌ సాయి పోలీసులను కోరాడు.

Also Read: కరోనా సోకుతుందని తుమ్మడం మానేస్తున్నారా..?

దగడ్‌ సాయి.. యూత్‌లో మంచి ఊపున్న పేరు. రెండు డిగ్రీలు, ఒక పీజీ చేసిన దగడ్‌ సాయి ఆతర్వాత తన ప్రయాణాన్ని సెటిల్‌మెంట్ల వైపు మార్చాడు. ఇతను బోయిన్‌పల్లి సెవెన్‌ టెంపుల్స్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. గతంలో దగడ్‌ సాయి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న యువతపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేసిన విషయం తెలిసిందే. దగడ్‌ సాయికి యూత్‌లో మాంచి పేరు ఉంది. ఇప్పటికి దగడ్‌ సాయికి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు.

Also Read: శృంగారం చేస్తే కరోనా వస్తుందా.? నిపుణులు ఏమంటున్నారు

Next Story
Share it