కరోనా సోకుతుందని తుమ్మడం మానేస్తున్నారా..?

By అంజి  Published on  21 March 2020 8:48 AM GMT
కరోనా సోకుతుందని తుమ్మడం మానేస్తున్నారా..?

ఇప్పుడు మనం తుమ్ము గురించి మాట్లాడుకుందాం.. ఎందుకు అంటారా? కరోనా వైరస్‌ వ్యాప్తిలో తుమ్మే ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిసింది. కరోనా బాధితుడు తుమ్మినప్పుడు కరోనా వైరస్‌తో కలిసిన తుంపర్లు గాలిలోకి వస్తాయి. ఆ సమయంలో అతడి చుట్టుపక్కుల ఉన్నవారికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇలా కరోనా వైరస్ తుమ్మును అడ్డంపెట్టుకొని మనపై దాడి చేసి.. ప్రాణాలను బలిగొంటోంది. అయితే కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలను హరిస్తున్న నాటి నుంచి మన మానవ సమాజంలో తుమ్మే వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని తెలిసింది.

మనం తుమ్మినప్పుడు.. పక్కన ఉన్న వాళ్లు చూసి కరోనా వచ్చిందేమోనని అనుకుంటారన్న అనుమానంతో చాలా మంది తుమ్మడం మానేస్తున్నారు. ఇది వరకైతే గట్టిగా అరుస్తూ.. లేదంటే ప్రశాంతం తుమ్మే వారు. అయితే కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి కనపడడం లేదు. కొందరైతే బలవంతంగా తుమ్మును ఆపుతున్నారు. లేదంటే ముక్కు మూసుకొని వేగంగా గాలి పీల్చుతూ తుమ్మును ఆపేస్తున్నారు. అయితే అలా తుమ్మును ఆపడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. తుమ్ము వస్తే ఖచ్చితంగా తుమ్మాలని చెబుతున్నారు. అయితే తుమ్ము వచ్చినప్పుడు మోచేతిని అడ్డుంపెట్టుకోవడం లేదా కర్ఛీప్‌ అడ్డం పెట్టుకోవడం చేయాలి.

ఒక వేళ బలవంతంగా తుమ్మును ఆపితే ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. పబ్లిక్‌ ప్లేస్‌లో మాత్రం కాస్తా జాగ్రత్త వహించి తుమ్మడం మేలు. తుమ్ము అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది.. అయితే నిర్లక్ష్యం చేసి తుమ్మును మాత్రం ఆపే ప్రయత్నం చెయొద్దు. తుమ్మును బలవంతంగా ఆపడం వల్ల చెవుడు వచ్చే ప్రమాదం ఉందని, చెవులపై దాని ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరికి కంట్లోని రక్త నాళాలు బ్రేక్‌ అవుతాయని, మెదడులోని రక్త నాళాలు కూడా బలహీనంగా మారిపోతాయి.

అసలు తుమ్ము ఎందుకు వస్తుందో తెలుసా.. మన శరీరంలోకి అవసరం లేనిది ప్రవేశిస్తే.. దానిని బయటకు పంపేందుకు మన ముక్కు కంకణం కట్టుకుంటుంది. అలా శరీరంలోకి ప్రవేశించి సూక్షక్రిమి లేదా బ్యాక్టీరియాను తరిమికొట్టే సమయంలో తుమ్ము అనేది వస్తుంది. ఇలా ఒక్కసారిగా తుమ్మడం వల్ల శరీరంలోకి ప్రవేశించిన అనవసరమైనని బయటకు వస్తాయి. అయితే తుమ్మను ఆపితే మాత్రం బ్యాక్టీరియా గానీ, సూక్ష్మక్రీములు గాని శరీరంలోనే ఉండిపోతాయి. ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో తుమ్ములు వస్తుంటాయి. ఒకరికి చలికాలంలో, మరొకరికి ఎండకాలంలో, ఇంకొందరికి దుమ్ము ప్రదేశాలకు వెళ్లినప్పుడు వస్తుంటాయి. అయితే ఇప్పటికి కూడా తుమ్ము పూర్తిగా డాక్టర్లకు అంతుబట్టని విషయంగానే ఉంది. కరోనా వైరస్‌ వస్తోందని.. తుమ్మడం మాత్రం ఆపకండి. ఖచ్చితంగా తుమ్మాలి..

Next Story