11 నుంచి సామాన్యులకు శ్రీవారి దర్శనం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2020 6:07 AM GMT
11 నుంచి సామాన్యులకు శ్రీవారి దర్శనం

సామాన్యుల కోసం తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుకోనున్నాయి.తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతించని విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాల్లో దర్శనాలు ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ మేరకు అనుమతి ఇవ్వాలని టీడీడీ జేఈవో ధర్మారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ట్రయల్ పద్ధతిలో దర్శనాలు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది.

దీంతో ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజులు పాటు టీటీడీ ఉద్యోగులతో పాటు తిరుమల స్థానికులకు ప్రయోగాత్మక దర్శన కల్పించనున్నారు. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. 11వ తేదీ నుంచి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు నిర్వహించే ప్రయోగాత్మక దర్శనంలో భాగంగా కరోనా నియంత్రణ చర్యలను ఎలా అమలు చేయాలన్నది పరిశీలిస్తారు. రోజుకు 7వేల మందిని దర్శనానికి అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీలో 7,400 మంది రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు 14 వేల మంది పొరుగు, ఒప్పంద సేవల సిబ్బంది ఉన్నారు.

ఇక సర్వదర్శనాలకు కూడా ఆన్‌లౌన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనే నిబంధన తీసుకురానున్నట్లు తెలిసింది. పది రోజుల అనంతరం భక్తుల సంఖ్యను పెంచాలని బావిస్తున్నట్లు సమాచారం. ఆర్థిత సేవలకు అప్పుడే భక్తులకు అనుమతించకూడదని భావిస్తున్నారు. క్యూలైన్లలో అధికారులు పలు మార్పులు చేశారు. ఇనుప కమ్మీలు ఏర్పాటు చేసి గీతలు గీశారు.

Next Story
Share it