తిరుమలలో శ్రీవారి తిరునామంతో గోవు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2020 6:28 AM GMT
తిరుమలలో శ్రీవారి తిరునామంతో గోవు

తిరుమలలో శ్రీవారి తిరునామంతో ఉన్న గోవు కనిపించింది. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో జ‌న‌సంచారం లేక‌పోవ‌డంతో కొండ‌పై వ‌న్య‌ప్రాణులు, జంతువులు స్వేచ్చ‌గా సంచ‌రిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అలిపిరి వ‌ద్ద శ్రీవారి తిరునామంతో ఓ గోవు క‌నిపించింది. వెంకటేశ్వర స్వామి నుదట ధరించే తిరునామం మాదిరిగానే.. ఆవు నుదుట కూడా సహజసిద్ధంగా తిరునామం ఆకారం ఉంది. ఈ ఆవును చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా ఈ గోవును టీటీడీ అధికారులు గోశాల‌కు త‌ర‌లించారు.,

కాగా.. గత నెల 20 వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతివ్వడం లేదు. స్వామివారికి కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో టీటీడీ దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆదాయం కోల్పోయింది. కాగా, వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చి.. లాక్ డౌన్ ఎత్తివేసేంత వరకు దర్శనాలకు అనుమతి ఉండబోదని టీటీడీ అధికారులు తేల్చి చెబుతున్నారు.

Next Story