తిరుపతి: తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. ఆకతాయిలు గురువారం నాడు అటవీ నిప్పంటించారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. తిరుపతి జీవకోన స్థానిన నివాస ప్రాంతంలో మంటలు చెలరేగాయి. స్థానిక గృహాల వరకు మంటలు రాకుండా,అటవీ ప్రాంతంలో మంటలను అదుపు చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది, వెదురు మండలతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది కూడా మంటలను అదుపు చేసే పనిలో పడ్డారు. అయినా మంటలు అదుపు కాలేదు.

Also Read: ఈ సమయంలో.. నాపై రూమర్లు దారుణం!

ఓ వైపు కరోనా మహమ్మారి నుండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ళలోంచి రాకుండా ఉంటే, ఆకతాయిలు బయటకు వచ్చి అడవికి నిప్పంటించి దుర్మార్గపు పని చేశారు. మంటల దాటికి అడవి తగలబడిపోతోంది. దట్టమైన పొగలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. భారీగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బలంగా గాలులు వీస్తుండటంతో మంటల వ్యాప్తి ఎక్కువైంది.

Also Read: 51 మంది హత్య కేసు.. నేరం ఒప్పుకున్న బ్రెంటన్‌

కరోనా వైరస్‌ ప్రభావంతో తిరుమలలోని శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఆలయం ప్రస్తుతం పూర్తి నిర్మానుష్యంగా ఉంది. శ్రీవారికి అర్చకులు ప్రత్యేక పూజలు కొనసాగిస్తున్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story