ఈ సమయంలో.. నాపై రూమర్లు దారుణం!

రేణూ దేశాయ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడుప్పుడు అభిమానులు సంధించే ప్రశ్నలకు జవాబులిస్తుంటారు. ఆమె కనిపిస్తే చాలు.. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, ఆమెను అభిమానించే అభిమానులు ప్రశ్నలమీద ప్రశ్నలు అడుగుతారు. నిన్నమొన్నటి వరకు ఆమె ట్విట్టర్‌లో, ఇతర లైవ్‌ కార్యక్రమాల్లో కనిపించినప్పుడు మీరు, పవన్‌ కళ్యాణ్‌ కలిసి ఎప్పుడు సినిమా తీస్తారు అంటూ ప్రశ్నలు సంధించేవారు. తాజాగా ఓ నెటిజర్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న వకిల్‌ సాబ్‌ సినిమాలో మీరు నటిస్తున్నారంట.. నిజమేనా అంటూ ప్రశ్నించారు.

Also Read :తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌

దీంతో ఒక్కసారిగా రియాక్ట్‌ అయిన రేణుదేశాయ్‌.. నో.. ఇది పచ్చి అబద్దం.. ఎవరో రూమర్లు స్టార్ట్‌ చేశారు. అసలు రూమర్లు స్టార్ట్‌ చేసే అంత సమయం వారికి ఎలా ఉంటుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి వారి తీరును చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించడం లేదని స్పష్టం చేశారు. అసలు ఎలా వస్తాయో ఇలాంటి రూమర్లు.. నాకర్థం కాదు.. ఏదైనా ఉంటే నేనే చెబుతాగా అంటూ పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి రూమర్లకు చెక్‌ పెట్టండి.. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ కట్టడి చేయడానికి ప్రతీ ఒక్కరూ తన వంతు కృషి చేయండి అన్నారు. ఇంట్లో పెద్ద వారిని బాగా చూసుకోవాలని రేణు దేశాయ్‌ సూచించింది. అంతకు ముందు తన కూతురు ఆధ్యా  స్కేటింగ్‌, పెయింటింగ్‌, డ్రాయింగ్‌, శాండ్‌విచ్‌ కుకింగ్‌ బాగా చేస్తుందని ఆమె తెలిపింది.

Also Read :కరోనా భయంతో.. అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు.. చివరికి

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *