కరోనా భయంతో.. అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు.. చివరికి

By Newsmeter.Network  Published on  26 March 2020 8:45 AM GMT
కరోనా భయంతో.. అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు.. చివరికి

కరోనా వైరస్‌.. ఈ పేరు చెబితే చాలు ప్రతీ ఒక్కరు వణికిపోతున్నారు. ఎక్కడ ఈ వైరస్‌ సోకుతుందా అనే భయంతో ఇండ్లకే పరిమితమవుతున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌ డౌన్‌ ప్రకటించారు. గత మూడు రోజులుగా లాక్‌ డౌన్‌ కార్యక్రమం జరుగుతుంది. ఈ లాక్‌డౌన్‌లో ప్రజలు పాల్గొంటున్నారు. ఎవరైనా బయటకు వస్తే పోలీసులు వారిని ఇండ్లకు పంపించి వేస్తున్నారు. మరోవైపు బయట వారు ఎవరూ గ్రామాలకు రాకుండా గ్రామ పొలిమేరల్లో గ్రామస్తులే స్వచ్చందంగా ముళ్ల కంపును వేసుకుంటున్నారు. మా గ్రామానికి ఎవరూ రావొద్దంటూ పేర్కొంటున్నారు. ఇదే క్రమంలో పెద్దపల్లి జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది.

Also Read :అలా పడుకుంటే.. ‘కరోనా’ నుంచి ఉపశమనం..!

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపేట గ్రామానికి చెందిన రాజయ్య మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో సింగరేణిలో పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం ప్రస్తుతం అక్కడే ఉంటుంది. అయితే తన తల్లి లక్ష్మీ అనారోగ్యంతో గత రెండు రోజుల క్రితం మృతిచెందింది. కాగా తల్లి మృతదేహానికి తన సొంత గ్రామమైన ముత్తారంలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు గురువారం రాజయ్య, అతని బంధువులు వచ్చారు. ఈ వి షయం తెలుసుకున్న గ్రామస్తులు ఊరిలోకి రాకుండా పొలిమేరల్లోనే నిలిపివేశారు. మా గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించొద్దంటూ అడ్డుకున్నారు.

Also Read : విమర్శలు కాదు.. ఎంత త్వరగా రెస్పాండ్‌ అయ్యామో చూడాలి

విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలికి చేరుకొని మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలించి పక్షవాతంతో చనిపోయినట్లు నిర్ధారించారు. అయిన గ్రామస్తులు ససేమీరా అనడంతో, అధికారులు నచ్చజెప్పారు. దహన సంస్కారాలు పూర్తి చేసి గృహనిర్బంధంలో ఉండాల్సి వస్తుందని, అలా అయితే దహన సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పారు. దీంతో తమ సొంత భూమిలో కార్యక్రమం నిర్వహించి వెళ్తామని గ్రామస్తులకు రాజయ్య వివరించడంతో.. గ్రామస్తులు అంగీకరించారు. రాజయ్య వెంట వచ్చిన బంధువులే గుంత తియ్యడంతో.. మృతదేహాన్ని పూడ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియల అనంతరం రాజయ్య, ఆయన బంధువులు అక్కడి నుండి వెనుదిరిగారు.

Next Story