మహిళ ఎదురుగా ఎస్సై వికృత చర్య.. వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 1 July 2020 2:16 PM ISTతన గొడును వెల్లబోసుకోవడానికి పోలీస్ స్టేషన్ వెళ్లింది ఓ మహిళ. అయితే.. ఆ ఎస్సై ఆ మహిళ ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మొదట దిగ్భ్రాంతి చెందిన ఆ మహిళ తరువాత ఆ దరిద్రాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియో వైరల్ కావడంతో.. ఎస్సైని సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఓ భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి ఉత్తరప్రదేశ్‌లో డియోరియాలోని భట్ని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పని చేసే ఎస్సై భీష్మ్ పాల్ సింగ్ ఫిర్యాదు గురించి సదరు మహిళతో మాట్లాడాలంటూ తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె ఎదురుగా హస్తప్రయోగం చేసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఈ దరిద్రాన్ని సదరు మహిళ సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసి సోషల్ మీడయాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎస్సైని సస్పెండ్ చేశారు.
‘భూ సమస్య పరిష్కారం కోసం నేను ఇప్పటికి పలుమార్లు ఈ పోలీసు స్టేషన్‌కు వచ్చాను. గతంలో 2, 3 సార్లు ఆ ఎస్సై ఇలానే ప్రవర్తించాడు. దీని గురించి నా స్నేహితురాలికి చెప్పాను. అప్పుడు ఆమె గతంలో భీష్మ్ పాల్ సింగ్ తన ముందు కూడా ఇలానే ప్రవర్తించాడని చెప్పింది. అందుకే ఈ సారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పడు సీక్రెట్ కెమరా తీసుకెళ్లాను. అతడి నీచ బుద్ధిని అందరికి తెలియజేయాలని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాను’ అని సదరు మహిళ తెలిపింది.