నా చావుకు ఎమ్మెల్యేనే కారణం.. గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
By తోట వంశీ కుమార్ Published on
30 Jun 2020 1:30 PM GMT

వరంగల్ జిల్లా హన్మకొండలో కలకలం రేగింది. ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక అదాలత్ కూడలి వద్ద చాకుతో గొంతుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని అలంకాని పేటకు చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డినే కారణమని సూసైడ్ నోటు లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story