ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు బరిలో దిగిన 672 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానం ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నెలకొంది. 21 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. ఈ ప్రక్రియను పరిశీలించడానికి 33 మంది పర్యవేక్షకులను ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ ముందంజలో ఉంది. మెజార్టీ స్థానాల్లో ఆప్‌ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. లెక్కింపు ప్రారంభం నుంచే ఆప్‌ జోరు ప్రదర్శిస్తోంది. కాగా ఈశాన్య, వాయువ్య ఢిల్లీలో బీజేపీ బలం చాటుకుంటోంది. ఇప్పటికైతే ఆప్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలే ప్రస్తుతం నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఆప్‌ కార్యాలయం దగ్గర కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. వరుసగా మూడో సారి విజయం దిశగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అడుగులు వేస్తోంది. ఏడు జిల్లాల్లో ఆప్‌ ఏకపక్షంగా దూసుకెళ్తోంది.

ప్రతాప్‌గంజ్‌లో డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ముందంజ

రోహిణి నియోజకవర్గంలో బీజేపీ నేత విజయేంద్రకుమార్‌ ముందంజ

షాకుర్‌ బస్తీ నుంచి మంత్రి సత్యేంద్ర జైన్‌ ముందంజ

చాందినీ చౌక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అల్కా లాంబా వెనుకంజ

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.