బ్రేకింగ్‌: ఢిల్లీలో భూకంపం

By సుభాష్
Published on : 12 April 2020 6:13 PM IST

బ్రేకింగ్‌: ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండటంతో భయాందోళనకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం పెద్ద శబ్దంతో భూకంపం సంభవించడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. భూకంపం రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.4గా నమోదైనట్లు తెలుస్తోంది.

Next Story