బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 9:19 AM GMT
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తీవ్రవాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం నరసాపురం, విశాఖ మధ్య రేపు రాత్రికి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 430 కి.మీ, కాకినాడకు 490 కి.మీ దూరంలో ఉందని తెలిపారు.

దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నేడు, రేపు తీరం వెంబడి గాలుల వేగం గంటకు 70 కి.మీ వరకు ఉండొచ్చని, సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీ దాకా వర్సాలు కొనసాగతాయని పేర్కొన్నారు.

Next Story
Share it