తల్లిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని రూమ్ మేట్‌ను అతి కిరాతకంగా హత్యచేశాడు..
Youth stabs roommate to death on rail tracks. 19 ఏళ్ల యువకుడు తన రూమ్‌మేట్‌ను రైలు పట్టాలపై కత్తితో పొడిచి హత్య చేసి.. ఆ తర్వాత
By Medi Samrat Published on 29 Jan 2022 4:09 PM IST
19 ఏళ్ల యువకుడు తన రూమ్‌మేట్‌ను రైలు పట్టాలపై కత్తితో పొడిచి హత్య చేసి.. ఆ తర్వాత కదులుతున్న రైలు కిందకు తోసిన షాకింగ్ సంఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. హత్య చేసిన యువకుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) శుక్రవారం అరెస్టు చేశారు. చనిపోయిన వ్యక్తి గణేష్ ముఖియా తన తల్లిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో నిందితుడు అశోక్ ముఖియా అనే వ్యక్తి ఈ దారుణ చర్య చేపట్టాడు. గురువారం రాత్రి కండివాలి మరియు బోరివలి రైల్వే స్టేషన్‌ల మధ్య ఈ షాకింగ్ సంఘటన జరిగినట్లు తేలింది. వీరిద్దరూ పోయిసర్ చాల్‌లోని ఒక గదిలో మరికొంత మంది వ్యక్తులతో కలిసి నివసిస్తూ ఉన్నారు. ఒక హోటల్‌లో పనిచేస్తున్నారు. వీరిద్దరూ సహా రూమ్‌మేట్స్ అందరూ బీహార్‌కి చెందిన మధుబనీకి చెందినవారు.
గణేష్ తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేవాడని, అయితే జరిగిన సంభాషణల గురించి అతను ఎప్పుడూ చెప్పలేదని అశోక్ పోలీసులకు తెలిపాడు. గణేష్ తన తల్లిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని. వారు ఎఫైర్ కలిగి ఉన్నారని తెలియడంతో అతనికి కోపం తెప్పించింది. రైలు పట్టాల వద్దకు వెళ్లి మద్యం మత్తులో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆశ్చర్యకరంగా, అశోక్ గణేష్‌ను కత్తితో పొడిచి, కదులుతున్న గూడ్స్ రైలు ముందు అతన్ని నెట్టివేసి అక్కడి నుండి పారిపోయాడు.
బోరివలి GRP సీనియర్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కదమ్ మాట్లాడుతూ.. "మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో, రైలు పట్టాలపై మృతదేహం గురించి మాకు సమాచారం అందింది. మృతదేహం ఇతర పరిస్థితులను పరిశీలిస్తే, ఇది ప్రమాదవశాత్తు మరణం కాదని మేము నిర్ధారించాము," అని తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఫోన్ ద్వారా మరణించిన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. విచారణ తరువాత, అతను అశోక్‌తో చివరిగా కనిపించాడని తేలింది. వీరిద్దరికి సంబంధించి ఇతర రూమ్‌మేట్‌లను కూడా విచారించగా, అదే సమయంలో అశోక్ నేరాన్ని అంగీకరించాడు.