దక్షిణ ఢిల్లీలోని పోష్ మాల్వీయా నగర్ ప్రాంతంలోని రద్దీ మార్కెట్‌లో గురువారం సాయంత్రం ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్య ఘటన కెమెరాకు చిక్కింది. 25 ఏళ్ల వ్యక్తిని కొందరు వ్యక్తులు పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. బాధితుడిని మయాంక్ పన్వార్‌గా గుర్తించారు. అతను హౌజ్ ఖాస్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఖిలా బేగంపూర్ వద్ద తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు.
ఆ సమయంలో మరొక గ్రూప్ తో వాగ్వాదానికి దిగాడు. ఆ గొడవ మరింత ముదరడంతో మయాంక్ అతని స్నేహితుడిని ఆ బృందం వెంబడించింది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో నిందితులు అతడిని కత్తితో పొడిచి చంపారు. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న వీడియోలో, తెలుపు నీలం రంగు టీ-షర్టు ధరించిన వ్యక్తి మయాంక్ అని తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తులు అతనిని అనేకసార్లు కత్తితో వెంబడించడం చూడవచ్చు. కొంతమంది షాక్‌తో చూస్తుండగా, మరికొందరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
దేశ రాజధానిలో గురువారం రోజే ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో అర్ధరాత్రి ఓ యువకుడిపై దాదాపు 10 మందితో కూడిన గుంపు దాడి చేసింది. మీడియా కథనాల ప్రకారం.. నిందితులపై కేసు నమోదు చేయబడింది. నిందితులను పట్టుకోవడానికి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.