దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలోని ఉన్నావ్‌లో ఓ యువతి అనుమానాస్పద మృతిపై కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తొలిరోజే యువతి మృతదేహం ఆస్పత్రిలోని 12 అడుగుల ఎత్తు ఉన్న గోడకు వేలాడుతూ కనిపించింది. బంగార్‌మౌ ప్రాంతంలో హర్దోయ్-ఉన్నావ్ రహదారి దగ్గర దుల్లాపూర్వా గ్రామానికి సమీపంలో కొత్త ఆసుపత్రి (న్యూ లైఫ్ హాస్పిటల్) తెరవబడింది. శుక్రవారం 19 ఏళ్ల యువతి మొదటి సారి ఉద్యోగంలో జాయిన్ అయింది. మొదటి రోజు, ఆమెకు రాత్రి డ్యూటీ విధించారు. శనివారం ఉదయం, ఆమె మృతదేహం ఆసుపత్రి వెనుక గోడకు వేలాడుతూ కనిపించాయి.
అక్కడి ఇనుప రాడ్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వేలాడుతున్న మృతదేహం ముఖానికి ముసుగు, చేతుల్లో రుమాలు వంటివి కనిపించాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదే సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చెందిన చాంద్ ఆలం, నూర్ ఆలం, అనిల్ సహా గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె కుటుంబానికి సహాయంగా ఉద్యోగంలో జాయిన్ అయింది. జాయిన్ అయిన మొదటి రోజే ఆమె ప్రాణాలు పోయాయి.