చీమలను చంపబోయి.. సజీవదహనమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

Young Woman Deceased Fire Accident Chennai. ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో చీమ‌లు ఉంటూనే ఉంటాయ్‌..! ఇంట్లో ఉన్న చీమ‌లు చంపేందుకు

By Medi Samrat  Published on  23 Nov 2020 6:20 AM GMT
చీమలను చంపబోయి.. సజీవదహనమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో చీమ‌లు ఉంటూనే ఉంటాయ్‌..! ఇంట్లో ఉన్న చీమ‌లు చంపేందుకు మంట పెట్టిందో యువ‌తి. అయితే.. ఆ మంటల్లోనే యువ‌తి స‌జీవ ద‌హ‌న‌మైంది. ఈ విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాజ‌ధాని చైన్నైలో ఆదివారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. చెన్నై అమింజికరైలోని పెరుమాల్ ఆలయం వీధిలో సత్యమార్తి దంపతులు నివ‌సిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కుమారై సంగీత‌(27) ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ‌లో ఇంజినీరుగా ప‌నిచేస్తోంది.

వారి ఇంట్లో చీమ‌లు పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఉండే అన్ని పదార్ధాల్లోను చీమలు పేరుకుపోయి ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్క‌డ చూసినా చీమ‌లే ఉండ‌డంతో.. వాటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. ఆ మంట‌ల‌పై మ‌రింత కిరోసిన పోసి నిప్పు పెట్టే క్ర‌మంలో ఆమె దుస్తులకు మంట‌లు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి ఒళ్లంతా పాకాయి. కుమారైకు అంటుకున్న అంటుకున్న మంట‌ల‌ను ఆర్పటానికి త‌ల్లి తీవ్రంగా యత్నించింది. కానీ సాధ్యం కాలేదు. మంటల్లో నిలువునా కాలిపోతున్న కుమారైను చూసి ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. ఆమె కేకలకు వేరే గదిలో ఉన్న తండ్రీ సోదరుడు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. చికిత్స నిమిత్తం సంగీత‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే.. శరీరం చాలా వరకూ కాలిపోవటంతో.. చికిత్స పొందుతూ సంగీత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా కూతుర్ని రక్షించే యత్నంలో సంగీత తల్లికి కూడా చిన్న చిన్న గాయాలవ్వటంతో ఆమె చికిత్సపొందుతోంది.


Next Story