మహిళను వివస్త్రను చేసి కొట్టారు..
Women stripped and beaten. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
By Medi Samrat Published on 15 April 2022 5:32 PM IST
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది. కొందరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి మహిళలను, వృద్ధులను కొట్టడం కనిపించింది. ఆ వీడియోలో మహిళలను తీవ్రంగా కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన చిక్కానా పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలౌటికి చెందిన నాగ్లా గ్రామానికి సంబంధించినది. గ్రామంలో ఇరువర్గాల మధ్య చాలా కాలంగా వాగ్వాదం జరిగినట్లు చెబుతున్నారు. గొడవలు చాలా ముదిరిపోయాయి. తాజాగా జరిగిన గొడవలో ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. దీంతో బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను పనికి వెళ్లానని బాధితురాలి కుటుంబ సభ్యుడు సహదేవ్ గుర్జార్ పోలీసులకు తెలిపాడు. ఆ సమయంలో వారు దాడి చేశారు. మహిళలను నిర్దాక్షిణ్యంగా కొట్టి వివస్త్రను చేశారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారిందని జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ వర్మ తెలిపారు. ఇందులో మహిళలపై దాడులు జరిగాయి. దాడి చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యా దులు అందాయి. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.