ఢిల్లీ లోని షాలిమార్‌బాగ్‌లోని ఒక కాలనీలో ముగ్గురు మహిళలను ఒక పురుషుడు కొట్టడం, తన్నడం, కర్రలతో కూడా కొట్టిన షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాలిమార్ బాగ్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాలనీకి చేరుకున్న మహిళల బృందం తమ కారును పార్క్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు కారు దిగగానే వెనుక నుండి వచ్చిన కొందరు వ్యక్తులు వారిని దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు.
కెమెరాలో చిక్కిన ఈ షాకింగ్ సంఘటన నవంబర్ 19 రాత్రి 10.15 గంటలకు జరిగిందని వార్తా సంస్థ ANI తెలిపింది. దాడికి పాల్పడిన వారు బాధితులకు తెలిసిన వారేనని, వారు ఏదో విషయంపై ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. మహిళ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.