అశ్లీల చిత్రాలు చూస్తూ.. పాచి అన్నం పెడుతూ భార్యకు వేధింపులు

Women abused by porn addicted husband in bengaluru. అశ్లీల చిత్రాలకు చూడటానికి బానిసైన ఓ భర్త.. తన భార్యను చిత్ర హింసలకు గురి చేశాడు. వద్దనందుకు కొట్టడంతో పాటు

By అంజి  Published on  3 Nov 2021 4:17 PM IST
అశ్లీల చిత్రాలు చూస్తూ.. పాచి అన్నం పెడుతూ భార్యకు వేధింపులు

అశ్లీల చిత్రాలకు చూడటానికి బానిసైన ఓ భర్త.. తన భార్యను చిత్ర హింసలకు గురి చేశాడు. వద్దనందుకు కొట్టడంతో పాటు పాచిపోయిన అన్నం తినాలంటూ భార్యను బలవంతం చేశాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్త అశ్లీల చిత్రాలకు బానిసై తనను వేధిస్తున్నాడని ఓ మహిళ (36) కోర్టు మెట్లెక్కింది. రెండేళ్ల కిందట జయనగర్‌కు చెందిన మహిళకు భారీగా కట్నకానుకలతో తల్లిదండ్రులు చాలా గ్రాండ్‌గా పెళ్లి చేశారు. పెళ్లైన కొత్తలో అంతా బాగానే ఉండేది. ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త అసలు రంగు బయటపడింది. భర్తకు అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉందని భార్యకు తెలిసింది. అంతేకాకుండా వేరే మహిళలతో భర్త చాటింగ్‌ చేయడాన్ని చూసింది. వారి కోసం భర్త డబ్బులు కూడా ఖర్చు పెట్టేవాడు.

ఇదే విషయమై భర్తకు ఎన్నోసార్లు నచ్చజెప్పింది. ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పింది. ఎంతకు వినని భర్త.. భార్యను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. భార్యను కొడుతూ, పాచిపోయిన ఆహారం తినాలంటూ చిత్ర హింసలకు గురి చేసేవాడని బాధిత మహిళ తెలిపింది. ఇదే విషయాన్ని భర్త తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లానని, అయినా వారు అతడికే మద్దతు తెలిపారని ఫిర్యాదులో వాపోయింది. ఇటీవల భర్త ఓ మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో తన పేరు మీద అకౌంట్‌ ఓపెన్‌ చేశాడని, అందులో డైవర్స్‌ తీసుకున్నట్లు పేర్కొన్నాడని బాధితురాలు తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. బాధితురాలి ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Next Story