'నా చావుకు నా భర్తే కారణం' అంటూ గోడ మీద రాసింది
Woman writes note on wall. మధ్యప్రదేశ్‌లోని గుణాలో వివాహిత మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 13 Jun 2022 10:35 AM ISTమధ్యప్రదేశ్‌లోని గుణాలో వివాహిత మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఇంటి గోడపై తనపై జరిగిన చిత్రహింసల గురించి రాసింది. భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని.. కోటాలో నివసిస్తున్న మహిళ తన జీవితంలో నిప్పులు పోసిందని తెలిపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుణలోని ఫతేగఢ్‌లో నివసిస్తున్న 42 ఏళ్ల ఉమా అలియాస్ జ్యోతి అగర్వాల్ శనివారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇండోర్‌లో నివసిస్తున్న ఉమ సోదరుడు శుక్రవారం సాయంత్రం మాత్రమే తన సోదరితో చర్చించినట్లు చెప్పారు. కుంభరాజ్‌కు చెందిన ఉమకు ఇది రెండో వివాహం. ఆమెకు మొదటి భర్త నుంచి 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
ఫతేనగర్‌లో పురుగుమందుల వ్యాపారి దీపక్ అగర్వాల్‌తో ఆమెకు 11 నెలల క్రితం వివాహమైందని ఉమ సోదరుడు తెలిపారు. దీపక్‌కి ఇది రెండో పెళ్లి కూడా. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు అంతా సవ్యంగానే సాగినా కొద్దిరోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 4 నెలల క్రితం గొడవ జరిగింది. ఆమె 8 రోజుల క్రితమే ఇండోర్ నుండి ఫతేఘర్ చేరుకున్నారు. అయితే మళ్లీ ఏమైందో ఏమో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె గోడపై చాలా విషయాలు రాసింది. మరణం వెనుక కారణం, మరణానికి కారణమైన వారి పేర్లను కూడా రాసింది. నా చావుకి దీపక్ (భర్త) కారణమని రాసి ఉంది. అతడిని కఠినంగా శిక్షించాలి. కోటాకు చెందిన మహిళ నా మరణానికి కారణం. గోడలపై వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని కూడా మహిళ ప్రస్తావించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.