భర్తను చంపేశానని అనుకున్న మహిళ.. ఆ తర్వాత ట్విస్ట్ ఏమిటంటే..?
Woman tries to kill husband, flees with cash and jewellery. జనవరి 17-18 మధ్య రాత్రి ఫరీదాబాద్‌లో తన భర్తను చంపడానికి ప్రయత్నించింది మహిళ.
By Medi Samrat Published on 26 Jan 2022 1:15 PM GMTజనవరి 17-18 మధ్య రాత్రి ఫరీదాబాద్‌లో తన భర్తను చంపడానికి ప్రయత్నించింది మహిళ. ఆ ప్రయత్నం విఫలమవ్వడంతో నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులతో పారిపోయిందని తెలుస్తోంది. ఆ మహిళ భర్త ఆహారంలో మత్తుమందులు కలిపి.. ఆ తర్వాత అతన్ని చంపడానికి ప్రయత్నించింది. బాధితుడు మైకంలో ఉన్నప్పుడు ఇద్దరు పురుషులతో కలిసి మహిళ సుమారు 20 నిమిషాల పాటు దాడి చేసింది. అతను చనిపోయాడని తప్పుగా భావించి.. నగదు, నగలు, విలువైన వస్తువులతో పారిపోయారు. రాత్రి భోజనానికి ముందు భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. 45 ఏళ్ల బాధితుడు తన భార్యతో తరచూ గొడవపడేవాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) నరేందర్ కడియాన్ తెలిపారు. ఆ మహిళ ఆహారంలో మత్తుమందు కలిపి, భర్త ముఖాన్ని దుప్పటితో కప్పి దాదాపు 20 నిమిషాల పాటు కొట్టిందని బాధితుడు తన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
బాధితుడు తన భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నాడు. భార్య ప్రియుడి అప్పులు తీర్చడం కోసం ప్రయత్నిస్తూ ఉండడంతో అది తప్పు అని బాధితుడు తెలిపాడు. కానీ ఆమె పట్టించుకోకుండా ప్రియుడు, మరొక వ్యక్తి సహాయంతో భర్తను లేపేయడానికి ప్రయత్నించింది. రాత్రి 10 గంటలకు ఆ మహిళ భర్తకు వండి పెట్టింది. అది తిన్నాక అతనికి కళ్లు తిరగడం మొదలై నిద్రపోయాడని పోలీసు అధికారి తెలిపారు. మరుసటి రోజు ఉదయం బాధితుడు మేల్కొన్నప్పుడు, అతని శరీరంపై అనేక గాయాల గుర్తులు ఉన్నాయి. ఇంట్లో ఉండాల్సిన విలువైన వస్తువులు ఏవీ కనిపించలేదు.. భార్య కూడా అక్కడ లేదు. బాధితుడు తన భార్య ఆచూకీ కోసం ప్రయత్నించినా ఆమె ఆచూకీ లభించలేదు. NIT ఫరీదాబాద్ పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి, భారతీయ శిక్షాస్మృతి లోని పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. విచారణ ప్రారంభించి, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.