భర్త లేని సమయంలో మహిళకు వేధింపులు.. అడ్డుచెప్పడంతో హత్య

Woman thrashed to death for objecting to neighbours peeping into her house. ఆదివారం రాత్రి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇద్దరు సోదరులు ఒక మహిళను జుట్టు పట్టుకుని లాగి, కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.

By అంజి  Published on  5 Jan 2022 2:54 PM IST
భర్త లేని సమయంలో మహిళకు వేధింపులు.. అడ్డుచెప్పడంతో హత్య

ఆదివారం రాత్రి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇద్దరు సోదరులు ఒక మహిళను జుట్టు పట్టుకుని లాగి, కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. మృతురాలు షబ్నమ్ చౌహాన్ (30)గా గుర్తించబడింది, ఆమె భర్త మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు, అందరూ ఐదేళ్లలోపు ఉన్నారు. బాధితురాలు తన ఇంట్లోకి చోద్యం చూసినందుకు ఇరుగుపొరుగున ఉన్న నిందితులు సోను, శంభులను మందలించింది. ఓ జాతీయ దినపత్రిక నివేదిక ప్రకారం.. భర్త ఇంట్లో లేని సమయంలో బాధితురాలిని నిందితులు వేధించారు. నిందితులు కిటికీలోంచి ఆమె ఇంట్లోకి చూస్తున్నారు. దీనిపై షబ్నమ్ అభ్యంతరం చెప్పడంతో సోను తన సోదరుడు శంభుతో కలిసి ఆమె ఇంట్లోకి చొరబడి జుట్టు పట్టుకుని బయటకు లాగాడు. బాధితురాలిని బయటకు లాగి ఇనుప పైపుతో దాడి చేసారు. అనంతరం నిందితులు సంఘటన స్థలం నుండి పారిపోయారు.

షబ్నమ్ కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని ఆమె భర్త సంతోష్‌కు తెలిపారు. సంతోష్ ఇంటికి చేరుకోగానే భార్య రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్ తిన్నాడు. మహిళను రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రికి తరలించగా, సివిల్ ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బీహార్‌కు చెందిన షబ్నం తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి షాపర్ వెరావల్‌లోని ఒకే గది ఇంట్లో నివసించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా, విచారణ కోసం సోనుని అదుపులోకి తీసుకున్నామని, ఇతర నిందితుడు శంభుని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని చెప్పారు.

Next Story