మహిళపై బస్సు కండక్టర్, క్లీనర్ అత్యాచారం

Woman Sexually Abused by bus conductor and cleaner. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో ఓ మహిళపై బస్సు కండక్టర్, క్లీనర్ అత్యాచారానికి

By Medi Samrat  Published on  16 Jan 2022 6:22 AM GMT
మహిళపై బస్సు కండక్టర్, క్లీనర్ అత్యాచారం

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో ఓ మహిళపై బస్సు కండక్టర్, క్లీనర్ అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ సూరత్ వెళ్లేందుకు బ‌స్సు కోసం బస్టాండ్‌లో కూర్చుంది. భాధిత మ‌హిళ‌తో న‌మ్మ‌కంగా మాట్లాడిన వారు నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి నేరం చేశాడు. ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ కండక్టర్, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం.. మహిళ గంద్వాని నివాసి. ఆమె శుక్రవారం రాత్రి గంద్వాని నుంచి ఇండోర్‌కు వెళ్లింది. ఇక్కడి నుంచి పని కోసం వెత‌క‌డానికి సూరత్ వెళ్లాల్సి వచ్చింది. దీంతో బస్టాండ్‌లో కూర్చుని బస్సు కోసం ఎదురుచూస్తోంది.

ఇంతలో.. ఇండోర్ నుండి రత్లాంకు నడుస్తున్న పంజాబీ ట్రావెల్స్ బస్సు క్లీనర్, కండక్టర్ ధర్మేంద్ర మహిళ ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఆమె వద్దకు వచ్చారు. ఆ మహిళతో మాట్లాడి రాత్రి అయిపోయిందని ఇద్దరూ చెప్పారు. న‌మ్మ‌కంగా మాట్లాడి వారివెంట‌ ఎంఓజీ లైన్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌కు తీసుకెళ్లారు. ఇక్కడ ఇద్దరూ మహిళపై అత్యాచారం చేశారు. ఘ‌ట‌న‌పై బాధిత మహిళ అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పూర్తి సమాచారం ఇచ్చింది. నిందితుల‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 32 ఏళ్ల మహిళపై కండక్టర్ ధర్మేంద్ర, క్లీనర్ మెహ్రాబాన్ అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేశారు.

బస్సు డ్రైవర్ కరణ్‌ను కూడా విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో రాత్రి బస్టాండ్‌లో బస్సును ఆపి, క్లీనర్, కండక్టర్‌ను వదిలి ఇంటికి వెళ్లినట్లు డ్రైవర్ కరణ్ చెప్పాడు. సమాచారం ప్రకారం.. మహిళ భర్త ఇండోర్‌లోని ఖజ్రానా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆ మహిళ తన భర్తతో విడిపోయి దూరంగా ఉంటోంది. సూరత్‌లో కూలీ పని కోసం వెతుక్కునే క్రమంలో గంద్వాని నుంచి ఇండోర్‌కు వచ్చి సూరత్‌ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న క్ర‌మంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.


Next Story
Share it